దాసుభాషితం

‘దాసుభాషితం’ తన లక్ష్యానికి ఇంత దగ్గరగా రావడం ఎంత సంతోషంగా వుందో నాకు 🙂 ఈ రోజే ఆఖరి అవకాశం జీవితకాలపు చందా సంవత్సరచందాతో పొందడానికి. లింక్ ఇక్కడ https://www.gocrowdera.com/c/tttjusizsq ఈ ఆప్ ని పరిచయం చేస్తూ ముందర ఫేసుబుక్లో రాసిన మాటలు ఇక్కడ. నోరెత్తడానికే భయపడే సుబ్బయ్య కాంట్రాక్టర్ దగ్గర ఐదువందలు ఎట్లా ఎందుకు తీసుకుని ఎంత గిజగిజపడ్డాడో, ఏ దారికి తేలాడో ‘అల్పజీవి’ లో చెబుతారు రావిశాస్త్రి. దయానిధి ముఖ్యపాత్రగా బుచ్చిబాబు గారు ఆవిష్కరించిన… Continue reading దాసుభాషితం

నిడదవోలు మాలతి గారికి మొల్ల పురస్కారం

నిడదవోలు మాలతి గారి డెబ్భై సంవత్సరాల సాహిత్యకృషి కి గానూ ఆవిడకి మొల్ల సత్కారం చేసిన సందర్భం. ఆ సందర్భంగా చేసిన ప్రసంగాలూ. వక్తలందరి ప్రసంగాలు

థెల్మా – మేరీ కొరెలీ

థెల్మా – మేరీ  కోరెల్లి  వంద క్లాసిక్ పుస్తకాల ప్రాజెక్టులో ఇంకొక టిక్ మార్క్.  నారింజా కెంజాయా ఊదా పచ్చా ఇంద్రనీలం విడివిడిగా కొన్నిచోట్లా, జమిలిగా కలిసి కొన్నిచోట్లా పూర్తిగా కలిసిపోయి ఓ విభ్రమ వర్ణాన్ని సృష్టించి మిగిలిన మొత్తం ఆకాశం పరుచుకున్నప్పుడు ఆ వెలుగుల మధ్య ఆ అందమైన అర్థరాత్రి వెలిగే సూర్యుణ్ణి చూడటానికి స్నేహితులకీ తన పడవకీ దూరంగా వచ్చిన సర్ ఫిలిప్ అర్థరాత్రి సూర్యుడికి ముందే చూసే మహాద్భుత సౌందర్యరాశి థెల్మా (ఇంగ్లీష్… Continue reading థెల్మా – మేరీ కొరెలీ

తెలుగు పెద్దకథలు – దీపావళి ఎడిషన్ 2022

దీపావళి పెద్దకథల వైభవాన్ని మళ్లీ తెలుగుపాఠకులకు అందించే ఉద్దేశ్యంతో మహమ్మద్ ఖదీర్ బాబు గారు తానే సంపాదకునిగా చేసిన బృహత్ ప్రయత్నం ఫలితమే ‘తెలుగు పెద్దకథలు – దీపావళి ఎడిషన్ 2022’. మొత్తం పదహారు మంది కథకుల కథలూ, ఒక్కొక్కదానిపై విశ్లేషకుల విశ్లేషణలూ వెరసి 325 పేజీల పుస్తకం. మొత్తం ప్రయత్నంలో పాల్గొన్న అందరికీ ముందుగా అభినందనలు చెప్పాల్సిందే. నిజానికి ఈ పుస్తకం గురించి చాలా పరిచయాలో, విశ్లేషణలో, సమీక్షలో వస్తాయి అనుకున్నాను; నాకైతే పెద్దగా ఎదురుపడలేదు.… Continue reading తెలుగు పెద్దకథలు – దీపావళి ఎడిషన్ 2022

“बिखरने का मुझको शौक़ है बड़ा”

“बिखरने का मुझको शौक़ है बड़ासमेटेगा मुझको तू बता ज़रा” ఏమి మాటలివీ!! సినిమా చూడగానే నా మొదటి ప్రేమ మెలడీ, తర్వాత లయా కాబట్టి అదే వరుసలో फेरों ना नज़र से नज़रिया, जाने बलमा घोडे पे क्यों सवार है, उड़ जायेगा… हंस अकेला, हंस अकेला, निर्गुण निरवैर టకటకా నచ్చేసాయి. ఈ మాటలు ఒకసారి జాగ్రత్తగా విన్నాక మాత్రం కబీర్ కూడా పక్కకు వెళ్లిపోయాడు.… Continue reading “बिखरने का मुझको शौक़ है बड़ा”

రేవా (REVA)

ప్రతీ సినిమాలో హీరోకి ఒక లక్ష్యం వుంటుంది ఎక్కువగా ఒక అమ్మాయి వైపో ఏదో సాధించడంవైపో ప్రయాణమూ అందులో భాగంగా రకరకాల ఆటంకాలు; అవన్నీ ఎట్లా దాటేసి సాధించాడూ, లేదూ అన్నదే ఫార్మాట్ సినిమా. సాధారణమైన ఫార్మాట్. ఈ సినిమా కూడా ఆ లెక్కలో ఏమీ అసాధారణం కాదు. ఫక్తు commercial ఫార్మాట్, అందులోనూ పెద్ద ఊహించలేని రైటింగ్ కూడా కాదు. కానీ, ఒకానొక దశలో ఈ సినిమా మనతో కనెక్ట్ అవుతుంది, ఉత్త డ్రామాను దాటేసి… Continue reading రేవా (REVA)

హాఫ్ ఆఫ్ ఎ యెల్లో సన్ – చిమమాండా గోజీ అడీచే

నైజర్ మనదేశంలోని అతి పెద్ద నది బ్రహ్మపుత్ర కన్నా పెద్దది. పశ్చిమ ఆఫ్రికాలోని ముఖ్యనది. కొంత స్వఛ్చమైన నదిగానే చెప్పుకోవచ్చు, అందువల్ల జనావాసాలూ పెరిగాయి. బెనిన్, గినియాల గుండా ప్రవహించినా తనపేరుని నైజీరియా దేశానికి ఇచ్చింది. నైజీరియా కూడా మనదేశంలానే విగ్రహారాధకులు మూలవాసులుగా ఉన్న దేశం. ప్రధాన తెగలు లేదా జాతులు మూడు, అవి ఇగ్బో, యోరుబా, హౌసా. జాతుల మధ్య రకరకాల కారణాలకి వైరాలు అక్కడా సహజం. క్రమంగా ఈ తెగల్లో ఇస్లాం, క్రిస్టియన్ మతావలంబకులు… Continue reading హాఫ్ ఆఫ్ ఎ యెల్లో సన్ – చిమమాండా గోజీ అడీచే

దమయంతి కూతురు – పి.  సత్యవతి – కథ 2012

పోయినేడాది మొదట్లో శృతకీర్తి తలపెట్టిన ఒక ప్రాజెక్టు కోసం రాసిన వ్యాసం, కరోనా కోరలకు చిక్కి చిక్కుపడిపోయింది. మీకు బోలెడు ధన్యవాదాలు శృతా 🙂 మీరు గట్టిగా చెప్పకుంటే ఈ మాత్రం పొందికగా ఎప్పటికీ రాసేదాన్ని కాదు. రాయడం ఒకేసారి పూర్తి చేసినా చదివింది తక్కువ కాదు, నాకు ఆన్లైన్ లో అప్పటికి అందుబాటులో వుండి దొరికినవన్నీ చదివాను. ఇది వాళ్ళందరి భుజాలమీదుగా చూసి రాసిందే కనుక వారందరికీ ధన్యవాదాలు. ఇది రాసినప్పటికి నేను సత్యవతి గారి… Continue reading దమయంతి కూతురు – పి.  సత్యవతి – కథ 2012

“బిఫోర్…”  ట్రయాలజీ

“ఇంకో కల వస్తూంటుంది… నువ్వు నా పక్కనే పడుకుని వుంటావ్, అప్పుడు ప్రెగ్నెంట్ వి. నిన్ను ముట్టుకోవాలనుకుంటాను చాలా ఇష్టంతో… నువ్వు వద్దంటావ్ అయినా ముట్టుకుంటాను నీ పాదానికి పైన… సుత్తిమెత్తని నీ చర్మం తాకుతుంది, హఠాత్తుగా మెలకువ వస్తుంది విపరీతమైన ఏడుపుతో. నా భార్య నాకేసి చిత్రంగా చూస్తుంది పక్కనే వుండి, నేనేమో తనకి పది మిలియన్ మైళ్ళ దూరంలో… I know something is wrong and I can’t keep living like… Continue reading “బిఫోర్…”  ట్రయాలజీ