పూర్వి, అగాథా క్రిస్టీ, ముక్తలతో నా ప్రయాణం

అటు చూస్తే అగాథా క్రిస్టీ ఇటు చూస్తే పొత్తూరివారి పూర్వి ఎంత కష్టం ఎంత కష్టం ఒక నాటి సాయంత్రం ఓ చదువరికి 😣 గుర్తుందిగా నేను పడ్డ తిప్పలు, మీరు చూపించిన సానుభూతి, నేర్పబోయిన దార్లూ 😚కష్టం అయితే మాత్రం మనం ఆగుతామా; కొంచెం అటూ ఇటూగా రెండూ కానిచ్చి మధ్యే మధ్యే పానీయం లాగా కుప్పిలి పద్మ గారి ముక్తను కూడా కలిపేసుకున్నా. ఏం చేస్తాం ఇంటిలోనికి పిలిచిమరీ పక్కన ఉంచడం మర్యాదేనా!!! అందరూ,… Continue reading పూర్వి, అగాథా క్రిస్టీ, ముక్తలతో నా ప్రయాణం

స్టాండ్ అండ్ డెలివర్

సాధారణమైన టీచర్లు అస్సలు కోరుకోని పిల్లలు. సాధారణమైన, ఎక్కువ జీతం ఇచ్చే ఉద్యోగం కన్నా హైస్కూల్లో పాఠాలు చెప్పడమే ఇష్టపడే టీచరు. పద్దెనిమిది మంది పిల్లలు, అందరి నేపథ్యం చూపకపోయినా విభిన్నమైనవే. హిస్పానిక్ పిల్లలు. బోలెడంత మంది పిల్లల్ని సంభాళించే పెద్దక్క ఒక పిల్ల, చదవాలని ఉన్నా పెద్దగా సహకరించని పరిస్థితులు. కార్లు రిపేర్ సరదా ఓ పిల్లాడికి, పిల్లాడిలా కనపడడు కూడా. ఆ ruggedness సదా ఉంటుంది వాడి దగ్గర అప్రయత్నంగా. సౌత్ ఆసియన్ పిల్లాడు… Continue reading స్టాండ్ అండ్ డెలివర్

Mija – Poetry (Rough sketch)

కొన్నాళ్ల క్రితం ఒక చిన్న పోస్ట్ రాస్తూ ధీరత్వం అణువణునా నింపిన పాత్రలుగా నాకు కనిపించిన హెమ్మింగ్వే oldman, మార్క్విజ్ colonel, కేశవరెడ్డి ముసలివాడిని సిబ్లింగ్స్ గా పోల్చుకున్నా. ఇది నేను చదివిన అతి తక్కువ సాహిత్యంలోనే సుమా. ఇప్పుడు ఒక ముసలావిడ బహుశా అంతకు మించిన స్థయిర్యంతో కనిపించింది Lee Chang-dong ‘Mija’ రూపంలో (సాహిత్య పాత్ర కాదు కానీ స్థాయి తక్కువ అనిపించలేదు).మిగిలిన ముగ్గురి యుద్ధాల్లో physical struggle చాలా ఎక్కువ పాత్ర పోషిస్తుంది,… Continue reading Mija – Poetry (Rough sketch)

డ్రీమ్స్ – అకీరా కురోసావ

మన కలలు ఏమవుతాయ్!! నాకైతే ఒకటో రెండో కలలు ఎప్పుడో ఓసారి లీలగా గుర్తుంటాయి. మీకు బహుశా కొన్ని కలలు నిద్ర లేచాక కూడా గుర్తుంటాయేమో. కలామ్ గారేమో కలంటే నిద్రలో వచ్చేది కాదు, నిద్ర పోనివ్వనిది అన్నారు. ఏదేమైనా కలలు మరిచిపోయేవాళ్ళు అరుదు కాదు, కలలు పట్టించుకోని వాళ్ళు అరుదు కాదు, కలల్ని నెరవేర్చడం కోసం పనిచేసేవాళ్ళు కాస్త అరుదే. కానీ, తన కలల్ని అందరితో పంచుకోవడం కోసం సెల్యులాయిడ్ పైకి తీసుకొచ్చింది మాత్రం నాకు… Continue reading డ్రీమ్స్ – అకీరా కురోసావ

కాసాబ్లాంకా

కాసాబ్లాంకా నుంచి కొన్ని కలలు, కొన్ని ఆశలు, కొన్ని ఆశయాలు వెరసి కొందరు మనుషులు వారి కలల స్వేచ్ఛాప్రపంచం అమెరికాకు చేరాలనే ప్రయత్నాల నేపథ్యంలో రెండవ ప్రపంచ యుద్ధపు కాలపు సినిమా. ఈ సినిమాలో యుద్ధం నీడ మాత్రమే కనిపిస్తూ, మానవ సంబంధాలు foreground లో ఉంటాయి. అమెరికన్ జాతీయుడైన రిక్ బ్లైన్ కాసాబ్లాంకా లో నైట్ క్లబ్ నడుపుతుంటాడు. మనిషి స్నేహశీలిగా కనిపించడు. క్లబ్ కి వచ్చేవారిలో అజ్ఞాతంలో ఉన్న పోరాట యోధులు, జర్మన్ అధికారులు,… Continue reading కాసాబ్లాంకా